కల్టీలతో రోగాలు
Vaartha-Sunday Magazine|January 14, 2024
మెరిసేదంతా బంగారం కానట్లే' నిగనిగలాడుతూ నోరూరించే పండ్లన్నీ తినడానికి పనికిరావని ప్రజలు గమనించాల్సిన రోజులివి. ప్రపంచమంతా కల్తీతో నిండిపోయింది.
తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
కల్టీలతో రోగాలు

తాను బాగుపడితే చాలు, మిగతావారు నాశనమైపోయినా పర్లేదనే ఆలోచన సమాజాన్ని కృంగదీస్తుంది.

బియ్యం పిండికి రంగు కలిపితే అది పసుపు.. పాలపొడిలో నీళ్లు కలిపితే చిక్కటిపాలు. అరటికాడ గుజ్జతో అల్లం వెల్లుల్లి పేస్తు. రసాయనాలు రుద్దితే నిగనిగలాడే పండ్లు, నాణ్యతలేని నూనెతో బియ్యానీ, నూడుల్స్, నాన్వెజ్ వేపుళ్లు, ఇలా చెప్పుకుంటూపోతే 'కల్తీ కలర్' పూసుకున్న తినుబండారాలను నోరూరించుకుంటూ తింటున్నాం. ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు అవసరమవుతున్న పండ్లకు సైతం ప్రమాదకర రసాయనాలను రుద్దుతున్నారు. కుంకుమ, నూనెలు, పప్పులు, చక్కెర, బియ్యం, ఇతర సరుకులను కల్తీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సౌందర్యపోషణకు వాడే ప్రముఖ ఫేమ్లకు సంబంధించి నకిలీల దందా మార్కెట్లో నిరాటంకంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా దుకాణాల్లో అమ్ముడవుతున్న నకిలీ ఫేమ్లను గుర్తించడం కష్టసాధ్యమే. పప్పులు, పండ్లు, కూరలే కాదు.ఇప్పుడు మార్కెట్లో కల్లీకాని సరకులే కనిపించడం లేదు. నెయ్యి, నూనెలు, సౌందర్య ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు,మిఠాయిలు, శీతల పానీయాలు, పచ్చళ్లు, పాలు, నీళ్లు.. ఇలా ఏది చూసినా కల్తీమయమే. కల్తీలు, నకిలీల నివారణకు పలు ప్రభుత్వ శాఖలున్నా అక్రమ వ్యాపారాలకు తెరపడడం లేదు. ఎంత సంపాదించినా తిండి విషయంలో రాజీ పడితే బతుకుబండి సాగదు గనుక నాణ్యమైన పండ్లు, కూరలు, నూనెలు, బియ్యం, ఇతర పదార్థాలు కొనాలని అందరూ భావిస్తారు. ఈ భావనే కల్తీ వ్యాపారులకు బలంగా మారుతోంది.అధిక లాభాలకు ఆశపడి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు, నాసిరకం వస్తువులు కలిపి కొందరు వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారు. సాధారణ ప్రజలే కాదు చదువుకున్న వారు సైతం ఆహార పదార్థాల్లో కల్తీ జరిగిన విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఒకప్పుడు మామాడి పండ్లను మగ్గించేందుకు మాత్రమే కార్బయిడ్ వంటి విషపూరిత రసాయనాలు వినియోగించేవారు.ఇప్పుడు అన్ని రకాల పండ్లను రసాయనాలతో కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారు. దీంతో ఏ పండ్లను కొనాలన్నా జనం భయపడే పరిస్థితి నెలకొంది.

Esta historia es de la edición January 14, 2024 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición January 14, 2024 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE VAARTHA-SUNDAY MAGAZINEVer todo
దారి చూపే రామాయణం
Vaartha-Sunday Magazine

దారి చూపే రామాయణం

పదకొండు సెప్టెంబరు, 1893 రోజు చికాగోలో ప్రపంచ సర్వ మత సమావేశంలో హిందూ భారత హృదయాన్ని ఆవిష్కరించిన స్వామి వివేకానంద ప్రసంగం అంతే ప్రాధాన్యం పొందిన తేదీగా 22 జనవరి, 2024న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

time-read
1 min  |
June 02, 2024
నీటి వంతెనలు చూడతరమా!
Vaartha-Sunday Magazine

నీటి వంతెనలు చూడతరమా!

సాంకేతికంగా సా ప్రపంచంలోని అన్ని అదేశాలు పరుగులుతీస్తున్నాయి.

time-read
4 minutos  |
June 02, 2024
సిండరిల్లా
Vaartha-Sunday Magazine

సిండరిల్లా

సింగిల్ పేజీ కథ

time-read
2 minutos  |
June 02, 2024
నాదస్వరానికి చిరునామా
Vaartha-Sunday Magazine

నాదస్వరానికి చిరునామా

నేను పలు చోట్ల కొన్ని నాదస్వరాలను వాయించాను. కానీ ఏ నాదస్వరమూ శుద్ధ మధ్యమం\" రాగానికి సరిపోయేది Q . అయితే నరసింగపేట్టర్లో ఆ నాదస్వరం \"3 తయారుచేసే వారున్నారు. తమిళనాడులోని తిరువావుడుదురై నుంచి అర కిలోమీటరు దూరంలో నరసింగపేట్టయ్ ఉంది. చెన్నై నుంచి 275 కిలోమీటర్ల దూరంలో ఉందీ నరసింగపేట్టయ్.

time-read
1 min  |
June 02, 2024
చెరగని కవిత్వ సంతకం శేషేంద్ర
Vaartha-Sunday Magazine

చెరగని కవిత్వ సంతకం శేషేంద్ర

కాలం నిన్ను ప్రశ్నిస్తోంది. నీవు ప్రజల పక్షాన నిలబడదలిస్తే కలంతో కదిలివచ్చి, వాళ్ల గుండెల మీద ముద్ర పడేలా రాయి. వాళ్ల జీవితాన్ని వాళ్ల భాషలోనే చెప్పు\" అంటారు మహాకవి శేషేంద్ర.

time-read
2 minutos  |
June 02, 2024
నవ్వుల్ ...రువ్వుల్...
Vaartha-Sunday Magazine

నవ్వుల్ ...రువ్వుల్...

నవ్వుల్ ...రువ్వుల్...

time-read
1 min  |
June 02, 2024
ప్రోటీన్ డైట్...
Vaartha-Sunday Magazine

ప్రోటీన్ డైట్...

మానవ శరీరం నిర్వహించాల్సిన విధులకు, ఆరోగ్యకర జీవనానికి అనేకరకాల పోషకపదార్థాలు అవసరమవుతాయి.

time-read
3 minutos  |
June 02, 2024
మొక్కలు నాటుదాం
Vaartha-Sunday Magazine

మొక్కలు నాటుదాం

బాల గేయం

time-read
1 min  |
June 02, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
June 02, 2024
తోడేలుకు బుద్ధి వచ్చింది
Vaartha-Sunday Magazine

తోడేలుకు బుద్ధి వచ్చింది

కథ

time-read
1 min  |
June 02, 2024