![అడుగడుగునా అగ్ని కీలలు](https://cdn.magzter.com/1397201783/1700943900/articles/R3gZ-2Mj61701134133941/1701134747537.jpg)
నిప్పు పెనుముప్పుగా మారితే? వెలుగు అంతరించి, మనిషి పెరిగి పెను నిర్లక్ష్యం తాండవిస్తే? ఆ జ్వాల తీవ్రతకు సర్వస్వమూ అంతరించిపోతుంది. ఇళ్లు మొదలు బహుళ అంతస్తుల భవనాల దాకా ఎక్కడ ఏ మూల నిప్పు రాజుకున్నా, అగ్ని ప్రమాదం దాపురించి చివరికి బూడిదే మిగులుతుంది. తెలుగునాట అనేక ప్రాంతాల్లో చాలామటుకు నేరపూరిత అలక్ష్యమే చెలరేగి సమస్తాన్నీ భస్మీపటలం చేసిన ఉదంతాలున్నాయి. జీవన భద్రత ఇంతగా నిట్టనిలువునా దహించుకు పోవడానికి మూలకారణాలేమిటి? పరిష్కార మార్గాలూ ఉన్నాయా, ఉంటే అవే మిటి? 'రక్షణా! నువ్వెక్కడ?' అని ప్రశ్నించాల్సి వస్తోంది. అంతర్జాతీయంగా చూస్తే ఎనిమిదేళ్ల క్రితం ఫిలిప్పీన్స్ లోని పారిశ్రామిక భవనంలో ఉవ్వెత్తున లేచిన మం టలు వంద మందికి పైగా ఉసురు తీశాయి. అంతా అప్పటికప్పుడే అక్కడి కక్కడే సజీవ దహనమయ్యారు. జాతీయంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా విపణి లో, అదే రోజన ఒడిశా రాజధాని ప్రాంతం భువనేశ్వర్ సచివాలయంలో, అలాగే తమిళనాడు రాజధాని నగరంలో ఉన్నత న్యాయస్థానం సముదాయంలో ఒక్కరోజునే అగ్నిప్రమాదాలు సంభవించాయి.
గతంలోకి తొంగిచూస్తే హరియాణా లోని దబ్యాలీలో పాఠశాల వార్షికోత్సవ వేదిక అంటుకుని, ఒకటీ రెండూ మూడు కాదు... ఏకంగా 450 మంది బడిపిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపో యాయి. అంతకుముందు ఉత్తరప్రదేశ్క చెందిన మేరఠ్ వాణిజ్య ప్రదర్శనలో అగ్నిజ్వాలలు ఎగసి ఎంతో మంది బతుకుల్ని బుగ్గిపాలు చేశాయి. ఇక ప్రాంతీయంగా మొన్నటికి మొన్న విశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీ ప్రమాదం. అక్కడి పదుల సంఖ్యలోని పడవలకు ఎవరో కావాలని నిప్పు పెట్టారన్నది ప్రాథమిక సమాచారం! లక్షల రూపాయల విలువైన సరకు పరశురామ ప్రీతి.
నివాసాల్లో అగ్గి
This story is from the November 26, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 26, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![ఆభరణాలకు భారత్ పుట్టినిల్లు](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/WzCIzvWoI1718262883073/1718263316468.jpg)
ఆభరణాలకు భారత్ పుట్టినిల్లు
భారతీయ నాగరికతలో ఆభరణాలకు సుమారు 8000 సంవత్సరాల క్రితం నుంచి ప్రాధాన్యత సంతరించుకుంది
![పూలు తెస్తే జరిమానా](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/M3nQnRxge1718262646888/1718262866923.jpg)
పూలు తెస్తే జరిమానా
కేరళలో మాత్రం పూలు తెస్తే ఫైన్ వేస్తాం అంటోంది అక్కడి దేవాదాయ కమిటీ. అదేంటని కంగారుపడుతున్నారా
![మ్యాంగో బఫే](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/w6ZTiicuA1718262478065/1718262646705.jpg)
మ్యాంగో బఫే
మ్యాంగో లవర్స్‌కి ఇష్టమైన వార్త అని చెప్పొచ్చు. సమ్మర్ అనంగానే గుర్తొచ్చేది పండ్లరాజు మ్యాంగో.
![వాల్మీకి గుహలను చూద్దామా!](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/t0zjPlA8Y1718261901016/1718262475962.jpg)
వాల్మీకి గుహలను చూద్దామా!
ప్రకృతి ఒడిలో అనేక వింతలు కనిపిస్తాయి. సహజ సిద్ధమైన గుహలు, గలగల పారే సెలయేర్లు.. జలపాతాలు..
![బాలగేయం](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/SINQGGljR1718261617552/1718261877067.jpg)
బాలగేయం
వేసవి కేరింతలు
![హలో ఫ్రెండ్...](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/n6anPw9A41718260635687/1718261617597.jpg)
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
![కథ](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/GDNT2CP811718260403110/1718260634288.jpg)
కథ
తగవు
![నయా మాయా దర్పణం](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/0cEiTqSBD1718246916704/1718247239057.jpg)
నయా మాయా దర్పణం
కళ్లలోకి నీళ్లు పెట్టి చూస్తూ, హావభావాలను ఒలకబోస్తూ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలిగిందో.ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా.
![పెద్దలు రాసిన పిల్లల కథలు](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/sbEAt2mmr1717986216934/1717986303619.jpg)
పెద్దలు రాసిన పిల్లల కథలు
పుస్తక సమీక్ష
![మంచు పర్వతం](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/2KFQ2q3Ee1717986045126/1717986212329.jpg)
మంచు పర్వతం
ఈవారం కవిత్వం