బొబ్బిలి వీణ విశిష్టత
Vaartha-Sunday Magazine|October 29, 2023
శ్రీసరస్వతీదేవికి అలంకార భూషితం... ఆ మహాజ్ఞాన ప్రసాదినికి విశ్వపరిపాలకుడు ఇచ్చిన పేటెంట్ హక్కు... సదరు వీణల తయారీలో విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రసిద్ధి గాంచడం బ్బి విశేషం.
- కొండ్రవీడి ఆచారి అదినారాయణ
బొబ్బిలి వీణ విశిష్టత

శ్రీసరస్వతీదేవికి అలంకార భూషితం... ఆ మహాజ్ఞాన ప్రసాదినికి విశ్వపరిపాలకుడు ఇచ్చిన పేటెంట్ హక్కు... సదరు వీణల తయారీలో విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రసిద్ధి గాంచడం బ్బి విశేషం. వీరబొబ్బిలికి చరిత్రలో ఓ ప్రత్యేకపుట ఉన్నట్లే బొబ్బిలి వీణకు ఆ చరిత్రతో పెనవేసుకునే బంధమూ ఉంది.

సంగీత ప్రియుల హృదయ తంత్రులను మీటడంలో బొబ్బిలి వీణకు సాటి మరిలేదనడంలో అతిశయోక్తి లేదు. ప్రముఖ వీణావా(నా)దకులు వాసా కృష్ణమూర్తి, ఈమని శంకరశాస్త్రి, చిట్టిబాబు, జోగులాంబ, పద్మిని, శ్రీవాణి ఇలా ఎంతో మంది వీణానాద కళాకారులు తమ ప్రతిభకు పదును పెట్టి పలువురు మన్ననలు అందుకున్నది కేవలం బొబ్బిలి వీణ మహత్మ్యంగా చెప్పుకుంటారు. రెండు శతాబ్దాల క్రితం నాటి బొబ్బిలి వీణల తయారీని 1959లో ప్రభుత్వం గుర్తించింది.

అనేకమంది ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవతో బొబ్బిలిలో 1994లో దివంగత రాజా ఆర్విజికె రంగారావు సౌజన్యంతో తాత్కాలికంగా వీణల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. 2002లో మున్సిపల్ పరిధిలోని గొల్లపల్లిలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ పరిధిలో హస్తకళలఅభివృద్ధి కేంద్రాన్ని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటుచేసారు. బొబ్బిలి, గొల్లపల్లి, వాడాడ గ్రామాలకు చెందిన సుమారు 50 కుటుంబాలకు చెందిన 200 మంది హస్త కళాకారులు బొబ్బిలి వీణలను తయారు చేయడంతో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.వడ్రంగం, కమ్మరం, దంతపు మెట్లు కట్టడం, సప్తస్వరాలను వీనులవిందుగా అందించే విధంగా తీగలను బిగించడం వంటి జాగ్రత్తలతో బొబ్బిలిలో వీణలను తయారు చేస్తారు.ఇలా తయారుచేయగలగడం ఇక్కడి వారి ప్రత్యేకత. పనస చెట్టునుంచి సేకరించిన కలపతో అతుకులు లేకుండా ఏకండి కర్రతో తయారు కావడమే బొబ్బిలి వీణ ప్రత్యేకత. ఇత్తడి లేక కంచుతో మెట్టు తయారుచేసి ఇత్తడి కర్రతో కుటీలు అమర్చి సుస్వరాలు పలికించడానికి కళాకారులకు కాస్త రాగ జ్ఞానం కూడా అవసరమని చెప్పవచ్చు. బొబ్బిలి వీణంటే వాయిద్యకారులకు ఎంతో మక్కువ. నూజివీడు, పిఠాపురం, తంజావూరు, మైసూరులలో వీణలు తయారవుతున్నప్పటికీ, బొబ్బిలి వీణ ప్రత్యేకత చెక్కుచెదరకపోవడం గమనార్హం.

This story is from the October 29, 2023 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the October 29, 2023 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA-SUNDAY MAGAZINEView All
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
April 28, 2024
పిల్లలపై ప్రభావం
Vaartha-Sunday Magazine

పిల్లలపై ప్రభావం

కథ

time-read
1 min  |
April 28, 2024
పూలజడ సింగారాలు
Vaartha-Sunday Magazine

పూలజడ సింగారాలు

రంగురంగుల పూల సొగసులూ, విరిసే తావులూ అవనిపైనా అవే కదా పుత్తడి బొమ్మ పెళ్లికూతురు సిగలో నగలైనా అభరణాలైనా!!

time-read
3 mins  |
April 28, 2024
తెలంగాణ సంస్కృతీ ఖజానా-లక్ష్మణ్ రావు
Vaartha-Sunday Magazine

తెలంగాణ సంస్కృతీ ఖజానా-లక్ష్మణ్ రావు

పుస్తక సమీక్ష

time-read
1 min  |
April 28, 2024
స్త్రీ ఔన్నత్యానికి ప్రతీక 'మోచనిక'
Vaartha-Sunday Magazine

స్త్రీ ఔన్నత్యానికి ప్రతీక 'మోచనిక'

పుస్తక సమీక్ష

time-read
1 min  |
April 28, 2024
నిలువెత్తు సృజనకారుడు.. వెంకటరత్నమ్
Vaartha-Sunday Magazine

నిలువెత్తు సృజనకారుడు.. వెంకటరత్నమ్

నిరంతరం కవితావ్రతుడు, నిర్విరామ కవి అడిగోపుల వెంకటరత్నమ్. 62 కవితలతో వెలువరించిన 28వ కవిత్వపొత్తం 'నిలువెత్తు సంతకం'.

time-read
1 min  |
April 28, 2024
నేటి యువత.. వారి భవిత
Vaartha-Sunday Magazine

నేటి యువత.. వారి భవిత

పుస్తక సమీక్ష

time-read
1 min  |
April 28, 2024
హృదయ శకలం
Vaartha-Sunday Magazine

హృదయ శకలం

హృదయ శకలం

time-read
1 min  |
April 28, 2024
ఆఖరి లేఖ
Vaartha-Sunday Magazine

ఆఖరి లేఖ

ఆఖరి లేఖ

time-read
1 min  |
April 28, 2024
చెత్తతో వీధి దీపాలు
Vaartha-Sunday Magazine

చెత్తతో వీధి దీపాలు

మహానగరాల్లో పదోపాతికో కుటుంబాలు కలిసి ఓ అపార్ట్మెంట్లో తలదాచుకోవడం పాత పద్ధతైపోయింది

time-read
1 min  |
April 28, 2024