విజేత
Champak - Telugu|February 2024
వార్షికోత్సవం సమీపిస్తోందని సారస్వాన్ సొసైటీలోని వారంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
వందనా గుప్తా
విజేత

వార్షికోత్సవం సమీపిస్తోందని సారస్వాన్ సొసైటీలోని వారంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇది సొసైటీలో ఏటా జరిగే ఆటపాటల సాంస్కృతిక కార్యక్రమం. పిల్లల్లో కొందరు ఒకవైపు కవితలు వినిపించడం, పాటలు పాడడంలో పోటీ పడుతుంటే మరోపక్క ఒక గ్రూపు నాటకాన్ని ప్రదర్శిస్తోంది. కొందరు విచిత్ర వేషధారణ పోటీలో పొడుపు కథలుగా తాము ధరించిన వేషాన్ని చెబుతున్నారు.

ఆ సొసైటీ అధ్యక్షుడు ఎల్మో ఏనుగు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటల నిర్వహణ బాధ్యతలను హేమ గుర్రానికి అప్పగించాడు.ఎన్నో ప్రయత్నాలు చేసినా రాళ్లు, రప్పలు, చెట్లు, దుంగలతో నిండి, పొడవైన ట్రాక్ ఏర్పాటుకు ఏ వీలు లేని ఆ అడవి పరుగు పందెం కోసం ట్రాక్ వేయడానికి హేమను ముప్పతిప్పలు పెట్టింది.

ఈ ఏడాది ఒక కిలోమీటర్ గుండ్రని ట్రాక్ సిద్ధం చేసారు. అందులో పొదలు, రాళ్లు, చెట్లు అడ్డంకులుగా ఉన్నా, ఛాయా చిరుత, హెూలీ జింక, రీనా కుందేలు, జాలీ జీబ్రా లాంటి వారెందరో అక్కడ ప్రతి రోజూ ప్రాక్టీసు చేయసాగారు.

మొట్టమొదటసారిగా ఆ అడవిలో పరుగు పందెం పోటీ ప్రారంభం కావడంతో ఆ వాతావరణమంతా ఉత్సాహంగా మారింది. విజేతకు పెద్ద మొత్తంలో డబ్బు, మెడల్ ఇస్తుండడంతో అది మరింత ఆసక్తికరంగా మారింది.

జాలీ ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేస్తోంది. ఛాయా, హోలీ, రీనాలను గెలవడమే తనకు చాలా ముఖ్యం. అందుకే ఒక మార్గాన్ని ఆలోచించుకుంది.

This story is from the February 2024 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the February 2024 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.