సరైన పరిష్కారం
Champak - Telugu|January 2024
సరైన పరిష్కారం
డా. కె. రాణి
సరైన పరిష్కారం

బుజ్జీ దోమ సాయంత్రం తాను దాక్కున్న ప్రదేశం నుంచి బయటకు వచ్చింది. పగలంతా ఆకలితో గడిపింది. దాన్ని తీర్చుకోడానికి ఇప్పుడు రక్తం కావాలి. మనిషి కోసం వెతకసాగింది.ఒక ఇంట్లోకి ప్రవేశించాక ఆమెకు ఒక కుర్చీపై కూర్చున్న వృద్ధ అంకుల్ జీవన్ కనిపించాడు.అతని కుడి కాలు మామూలుగా ఉంది. కానీ రెండవ దానిపై పలుచని గుడ్డ చుట్టి ఉంది.బహుశా దోమల నుంచి రక్షించుకోడానికి అలా చేసాడేమో. బుజ్జీ అటు ఇటు చూసింది. అక్కడ ఎవరూ లేరని గమనించింది. అంకుల్ జీవన్ చైర్లో నిద్రలో జోగుతున్నట్లు కనిపించాడు.

ఇంత మంచి అవకాశం లభించినందుకు బుజ్జీకి ఎంతో థ్రిల్గా ఉంది. ఆకలి తీర్చుకోడానికి వెంటనే జీవన్ అంకుల్ దగ్గరికి చేరుకుంది.పలుచని వస్త్రం నుంచి అతన్ని కుట్టడానికి ప్రయత్నించినప్పుడు బుజ్జీ తుండం చర్మంలోకి చొచ్చుకుని వెళ్లలేకపోయింది. చేతులతో తుడిచి మరో ప్రయత్నం చేసింది. కానీ నిరాశే ఎదురైంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవన్ కాలును కుట్టలేకపోయింది. అయోమయంలో పడింది. ఏం తప్పు జరిగిందో అర్థం కాలేదు.ఇంతకుముందు మనుషులను వారి బట్టల నుంచి ఎన్నోసార్లు కుట్టి విజయం సాధించింది.

ఇలా జరగడంతో తన వైఫల్యానికి వృద్ధాప్యమే కారణమని భావించిన బుజ్జీ నిరాశతో తిరిగి తన రహస్య ప్రదేశానికి వెళ్లిపోయింది. ఇంతలో షార్పీ దోమ ఆహారం వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది.

“ఎందుకంత తొందరగా తిరిగి వచ్చావు బుజ్జీ" అడిగింది షార్పీ.

"నేను దాన్ని వివరించలేను. ఈ రోజు నమ్మలేని సంఘటన ఒకటి జరిగింది. అది వింటే నువ్వు షాక్ తింటావు. నాకు వృద్ధాప్యం వచ్చిందేమో షార్పీ, ఏదీ నా స్వాధీనంలో ఉండటం లేదు” నిరాశగా బదులిచ్చింది బుజ్జీ.

“ఎందుకలా అంటావు? నువ్వింకా యవ్వనంగానే ఉన్నావు. దేన్నైనా సాధ్యం చేయగలవు”.

బుజ్జీ ఆందోళన వ్యక్తం చేస్తూ షార్పీకి జరిగినదంతా వివరించింది. ఈ కథ విని షార్పీ విచారం వ్యక్తం చేసింది.

"ధైర్యంగా ఉండు బుజ్జీ, నువ్వు ఇంత తొందరగా నమ్మకం కోల్పోతే మన కుటుంబం ఏం కావాలి?”

هذه القصة مأخوذة من طبعة January 2024 من Champak - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 2024 من Champak - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من CHAMPAK - TELUGU مشاهدة الكل
పరిష్కారం
Champak - Telugu

పరిష్కారం

అది 1901 సంవత్సరం. భారతదేశం బ్రిటీషు పాలనలో ఉన్న కాలం. మహారాష్ట్రలోని సతారాలో తొమ్మిది సంవత్సరాల భీమ్రావ్ తన అన్నయ్య, మేనల్లుడు నానమ్మతో నివసిస్తున్నాడు.

time-read
4 mins  |
April 2024
మన - వాటి తేడా
Champak - Telugu

మన - వాటి తేడా

బ్లూ డాషర్ తల పై భాగంలో కళ్లు ఉంటాయి. వాటితో అవి 360 డిగ్రీలు అంటే, చుట్టూ చూసే శక్తి కలిగి ఉంటాయి.

time-read
1 min  |
April 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.

time-read
1 min  |
April 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
April 2024
తాతగారు – బైసాఖీ
Champak - Telugu

తాతగారు – బైసాఖీ

తాతగారు – బైసాఖీ

time-read
1 min  |
April 2024
సరికానిది గుర్తించండి
Champak - Telugu

సరికానిది గుర్తించండి

ఈ బొమ్మల్లో ఎక్కడో తప్పులున్నాయి. అవేంటో కనుక్కోండి.

time-read
1 min  |
April 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

ఏప్రిల్ 10 తోబుట్టువుల దినోత్సవం

time-read
1 min  |
April 2024
కాఫీ స్పిల్ ప్యాచ్
Champak - Telugu

కాఫీ స్పిల్ ప్యాచ్

కాఫీ స్పిల్ ప్యాచ్

time-read
1 min  |
April 2024
బగ్ బాక్స్
Champak - Telugu

బగ్ బాక్స్

బగ్ బాక్స్

time-read
1 min  |
April 2024
స్మార్ట్
Champak - Telugu

స్మార్ట్

ఈ ఏప్రిల్ ఫూల్స్ రోజు, సరదాగా...చిలిపి పనులతో ఇతరులను నవ్వించండి.

time-read
1 min  |
April 2024