తేలియాడే ద్వీపం
Champak - Telugu|November 2022
జాస్మిన్ ఒక అందమైన జాకానా పక్షి. తామర పూల మొక్కలతో నిండిన నదిలో నివసించేది.
మురళి టీవీ
తేలియాడే ద్వీపం

జాస్మిన్ ఒక అందమైన జాకానా పక్షి. తామర పూల మొక్కలతో నిండిన నదిలో నివసించేది.పొడవాటి కాళ్లు, కాలివేళ్లు, పంజాలతో నీటిపై నడవడం ఆమె ప్రత్యేక లక్షణం. ఆమె నడుస్తున్నప్పుడు, ఆహారం కోసం మొక్కలను తిప్పేస్తుంది. నదిలో ఆమెను చూడటం అందరూ ఇష్టపడతారు. సగం మునిగి తేలియాడే ద్వీపంలా కనిపించే ఆమె గూడును చూసి వాళ్లు ఆశ్చర్య పోతుంటారు. జాస్మిన్ అద్భుతంగా ఈదుతుంది. డైవ్ చేస్తుంది. కానీ ఆమె తాను తక్కువ దూరం మాత్రమే ఎగురుతుంది. అందుకే ఆమె అసంతృప్తిగా ఉంది.

సూర్యుడు అస్తమించాడు. నెమ్మదిగా చీకటి అడవిని ఆక్రమించింది. జాస్మిన్ ఆకాశంలో మిణుకు మిణుకు మంటున్న నక్షత్రాలను కొద్దిసేపు చూసింది. తర్వాత కళ్లు మూసుకుంది.

"జాస్మిన్, లే లేచి ఇక్కడ కూర్చో, రా! తొందరగా” ఎవరిదో గొంతు విని జాస్మిన్ కళ్లు తెరిచింది. 'వాహ్, హెలికాఫ్టర్ పైన దేవకన్య?' ఆశ్చర్యపోయింది.ఆమె ఏమీ ఆలోచించక ముందే, దేవకన్య ఆమెను ఎత్తుకుని పైకి ఎగిరింది. నది, లోయ, కొండల మీదుగా హెలికాఫ్టర్ వెళ్లింది. “వావ్, ఏమిటీ వింత!” అరిచింది జాస్మిన్. తానెప్పుడూ అలా ఎగరలేదు.

“ఎవరు మీరు. ఎక్కడి నుంచి వచ్చారు?” అడిగింది జాస్మిన్ దేవ కన్యను.

“క్షమించాలి, నేను మీకు ఆ విషయం చెప్పలేను. నేను సుదూర ప్రదేశానికి చెందిన దేవకన్యను అనుకో" ఆమె జవాబు ఇచ్చింది.

జాస్మిన్ ముఖం వాడిపోయింది.

“హే, చీర్ అప్, అందమైన పక్షీ" అంది దేవకన్య.

జాస్మిన్ నవ్వుతూ “నేనొక హెలికాఫ్టర్ని అయితే

గనక టేకాఫ్ చేయగలను. వర్టికల్గా ల్యాండింగ్ హెూవర్ చేయగలను. ముందుకు వెనుకకి, పక్కకి ఎగరగలను” అని చెప్పింది.

“ఇప్పుడు ఏరోనాటికికి సరిపోయేంత ఎత్తులో ఎగరాల్సిన సమయం వచ్చింది" తన మంత్ర దండం ఊపుతూ చెప్పింది దేవకన్య.

కొద్దిసేపటికే హెలికాప్టర్ ఒక యుద్ధ విమానంలా మారిపోయింది. “జూమ్...” విమానం చాలా వేగంగా దూసుకుపోయింది. అది గాలిలో సాహసోపేతంగా వైమానిక విన్యాసాలు చేస్తున్నప్పుడు జాస్మిన్ “ఊ...హ్...” అని అరిచింది.

'వావ్, ఇది నిజంగానే ఎగురుతోంది. నేనూ ఒక యుద్ధ విమానం అయితే బాగుండు' గొణిగింది జాస్మిన్.

కానీ కొంత సమయం తర్వాత తన తల పగిలేలా ఉందని భావించి జాస్మిన్ దేవకన్యను కిందకి దిగమని బతిమాలింది. ఆమె నవ్వి మంత్ర దండాన్ని ఊపింది.

この記事は Champak - Telugu の November 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Champak - Telugu の November 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。