కొత్త ఆశల పల్లకి 'ఉగాది'
Vaartha-Sunday Magazine|March 31, 2024
ఈ సృష్టి యావత్తు బ్రహ్మదేవుడు తన భూత సృష్టిని ప్రారంభించిన సృష్ట్యాది నుంచి లేక ఈ కలియుగం ప్రారంభం మొదలు నుండిగానీ పంచాంగాలలో లెక్కించటం వాడుకగా వస్తున్న ఆచారం.
డాక్టర్ దేవులపల్లి పద్మజ
కొత్త ఆశల పల్లకి 'ఉగాది'

ఈ సృష్టి యావత్తు బ్రహ్మదేవుడు తన భూత సృష్టిని ప్రారంభించిన సృష్ట్యాది నుంచి లేక ఈ కలియుగం ప్రారంభం మొదలు నుండిగానీ పంచాంగాలలో లెక్కించటం వాడుకగా వస్తున్న ఆచారం. ఈ బ్రహ్మ సృష్టిలో ప్రళయం అయిపోయిన తరువాత తిరిగి ఆరంభించే అధ్యాయాన్ని బ్రహ్మకల్పం అని అంటూ ఈ ప్రారంభ కాలాన్ని 'కల్పాది' అని వ్యవహరిస్తారు. ప్రతీ కల్పంలోను మొదట వచ్చే 'ఆది' సమయమే 'ఉగాది' పండుగ. దీనిని గురించి 'సూర్య సిద్ధాంతం' అనే జ్యోతిష గ్రంథంలో స్పష్టంగా చెప్పబడింది. నాటి నుండి నేటి వరకు ఈ పద్ధతినే అనుసరిస్తూ ప్రతీ తెలుగు సంవత్సరం ఆరంభ దినంనాడు మనం ఉగాది పర్వదినం జరుపుకునే ఆచారం ఏర్పడింది. 'యుగాది' అన్న సంస్కృత పదం ఉచ్ఛారణ భేదం వలన 'ఉగాది' అనే తెలుగుమాట ఏర్పడింది.

చైత్రేమాసి జగత్ప్ర్బహ్మ ససర్జ ప్రథమే అహని ।

వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తథైవచ ll

 సృష్టి ప్రభవం అయిన మొదటి సంవత్సరం నుండి చరితార్థంగా 'ప్రభవ' అని నామకరణం చేసి అక్కడి నుంచి 'క్షయ' నామ సంవత్సరం క్రమంలో 60 నామాలతో సంవత్సర గమనం సాగుతుంది. క్షయ నామ సంవత్సరంతో సమాప్తమవుతుంది. కనుకనే మనం జన్మించిన మొదలు ఈ నామ చక్రం మనకు 60 సంవత్సరాల వయస్సుకు చేరినపుడు తిరిగి అదే సంవత్సరంతో పూర్తి అగుటచే షష్టిపూర్తి జరుపుకుంటాం.

వేదాలను హరించిన సోమకుడు అనే రాక్షసుని వధించి శ్రీ మహావిష్ణువు తిరిగి పునరుద్ధరించిన రోజు కూడా ఉగాది ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది.తెలుగు సంవత్సరం చైత్రం నుండి శిశిరం వరకు ఆరు ఋతువులుగా విభజించబడింది.సంవత్సరం పొడవునా అనేక ఒడుదుడుకులు అనుభవించిన ప్రకృతిలో చెట్లు శిశిర ఋతువులో ఆకులు రాల్చి జడత్వాన్ని పొందుతాయి.చైత్ర మాసంలో కొత్త చిగుర్లు తొడిగి చైతన్యవంతంగా కనిపిస్తాయి.

ఈ విధంగా ప్రకృతిలో సంభవించే నూతన వత్సరం చైత్ర మాసం. అందుకే ఈ మాసారంభానికి ఉగాది అని పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది మనలో కూడా నూతన ఉత్తేజాన్ని కలిగించి నవనవోన్మేషంగా ముందుకు తీసుకుపోవటానికి దోహదం చేస్తుంది. ఉగాది పర్వదినాన అభ్యంగనం, పుణ్యకాల సంకల్పం, ఉగాది పచ్చడి సేవనం, ధర్మకుంభం, సృష్టి క్రమ వర్ణన, కల్పాది వైవస్వత మన్వంతర వివరాలతో కూడిన పంచాంగ శ్రవణం అన ముఖ్యమైన విధులను అనుసరించవలసి ఉంటుంది.

అభ్యంగనం

Esta historia es de la edición March 31, 2024 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición March 31, 2024 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE VAARTHA-SUNDAY MAGAZINEVer todo
కుప్పకూలుతున్న హెలికాప్టర్లు
Vaartha-Sunday Magazine

కుప్పకూలుతున్న హెలికాప్టర్లు

దేశాధినేతలు, పాలకులు, ప్రముఖ రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు, సినిమా ప్రముఖులు, కోటిశ్వర్లు..ఇలాంటివారంతా తప్పనిసరిగా విమానాలు, హెలికాప్టర్లలో ప్రయాణం సాగించాల్సిందే.

time-read
2 minutos  |
June 02, 2024
అన్నమయ్య పదకవితా వైభవము
Vaartha-Sunday Magazine

అన్నమయ్య పదకవితా వైభవము

పుస్తక సమీక్ష

time-read
1 min  |
June 02, 2024
'నిరంతర యాత్రికుడు'
Vaartha-Sunday Magazine

'నిరంతర యాత్రికుడు'

పుస్తక సమీక్ష

time-read
1 min  |
June 02, 2024
మంచి పరిణత కవిత్వం
Vaartha-Sunday Magazine

మంచి పరిణత కవిత్వం

అభ్యుదయ కవయిత్రి పద్మావతి రాంభక్త 53 కవిత లతో వెలువరించిన రెండవ కవిత్వపొత్తం 'మెతుకు వెలుగులు'

time-read
1 min  |
June 02, 2024
ప్రభువుల చారిత్రక వైభవం
Vaartha-Sunday Magazine

ప్రభువుల చారిత్రక వైభవం

పుస్తక సమీక్ష

time-read
1 min  |
June 02, 2024
ఈవారం కవిత్వం
Vaartha-Sunday Magazine

ఈవారం కవిత్వం

చెమట కొండలు

time-read
1 min  |
June 02, 2024
ఎలక్షన్ రిపోర్ట్!
Vaartha-Sunday Magazine

ఎలక్షన్ రిపోర్ట్!

రాజకీయ పొగమంచులో అంతా అస్పస్టంగా ఉంది.రాజ్యం-మతం భుజాల మీద తుపాకి పెట్టి, సామాన్యుల్ని కాల్చేస్తూ ఉంది!

time-read
1 min  |
June 02, 2024
అంతా మనలాగే...
Vaartha-Sunday Magazine

అంతా మనలాగే...

అచ్చంగా మనలానే ఉంటాయి. మన అలానే మాట్లాడతాయి. మనలానే ఆలోచిస్తాయి. మనలానే సమాధానమూ ఇస్తాయి.

time-read
1 min  |
June 02, 2024
బంగారు ధూళి
Vaartha-Sunday Magazine

బంగారు ధూళి

అంటార్కిటికాలో ఉన్న 'మౌంట్ ఎరిబస్' ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అగ్నిపర్వతం.

time-read
1 min  |
June 02, 2024
గొప్పలు జాస్తి..'ఉపాధి నాస్తి!
Vaartha-Sunday Magazine

గొప్పలు జాస్తి..'ఉపాధి నాస్తి!

రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు.. తాము దేశానికి/ రాష్ట్రానికి రాబోయే ఐదుసంవత్సరాలకుగాను.. చేయబోయే / చేపట్టబోయే కార్యక్రమాలను క్లుప్తంగా తెలియజేసే ప్రణాళికా సరళిని మేనిఫెస్టోలంటూ.. ఓటర్లను ఆకర్షించేందుకు ఎలక్షన్ల ముందు ప్రచారంలో భాగంగా విడుదల చేస్తుంటాయి

time-read
6 minutos  |
June 02, 2024