కేంద్ర విద్యుత్‌ బిల్లు డేంజర్‌
Namaste Telangana Hyderabad|September 16, 2020
కేంద్ర విద్యుత్‌ బిల్లు డేంజర్‌
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్‌ చట్టం అత్యంత ప్రమాదకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.

 • సబ్సిడీ బంద్‌.. మళ్లీ మోటర్లకు మీటర్లు, బిల్లు కలెక్టర్లు

 • ఉత్తరాది కరెంటే కొనాలి.. లేకుంటే జరిమానా కట్టాలట

 • సమాఖ్య స్ఫూర్తిని గొడ్డలితో అడ్డంగా నరికే యత్నం: సీఎం

 • లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ పోతుంది

 • 50 వేల మంది ఉద్యోగులు ఏంగావాలె

 • కేంద్రం విద్యుత్‌ చట్టం పెను ప్రమాదం

 • కరెంట్‌ సమస్య వస్తే ఇకపై ఢిల్లీకి పోవాలె

 • క్రాస్‌సబ్సిడీలకు పూర్తిగా మంగళం పడతది

 • కోలుకుంటున్న రైతుపై పిడుగుపాటు ఇది

 • కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీల వైఖరేంటి?

 • రాష్ట్రంలో విద్యుత్‌ ప్రైవేటుకు ఇవ్వలేదు

 • ఒత్తిడి చేసిండ్రు.. సచ్చినా ఇయ్యనని చెప్పిన

 • విద్యుత్‌ బిల్లుపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌

 • కేంద్రం ఫాల్స్‌ ప్రెస్టేజ్‌కు పోవద్దని హితవు

 • వెంటనే ఉపసంహరించాలని డిమాండ్‌

 • బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆ చట్టం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, అనేక రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఈ చట్టంతో విద్యుత్‌పై రాష్ర్టాలకున్న అధికారం పోతుందని, విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరిస్తారని హెచ్చరించారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ చట్టం సవరణ బిల్లుపై అసెంబ్లీలో మంగళవారం స్వల్పకాలిక చర్చలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. కేంద్ర చట్టం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. కేంద్రం తీరును ఎండగట్టారు. ప్రధాని మోదీ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటని విమర్శించారు. దేశంలో మిగులు విద్యుత్‌ ఉన్నా అనేక ప్రాంతాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ బిల్లుతో రైతులు, పేదలు, విద్యుత్‌ ఉద్యోగులు.. ఇలా అన్నివర్గాల వారు నష్టపోతారని వివరించారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలంగాణ రైతాంగంపై ఇది పిడుగులాంటిదేనని సీఎం ఆవేదన చెందారు. కేంద్రంలోని వరుస ప్రభుత్వాలు దేశంలో వృథా అవుతున్న నీటిని వినియోగించే ప్రణాళికలు రూపొందించలేదని, కానీ రాష్ర్టాల అధికారాలను హరించేందుకు ప్రయత్నించాయని విమర్శించారు. నిండు సభ నుంచి ప్రధాన మోదీని రెండు చేతులు జోడించి.. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని వేడుకుంటున్నా.. అని చెప్పారు. కేంద్రం ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

కేంద్ర చట్టం ప్రమాదకరంగా ఉన్నది

కేంద్రం ప్రతిపాదించిన బిల్లు ప్రమాదకరంగా ఉన్నది. కాంగ్రెస్‌, బీజేపీలు దేశాన్ని పరిపాలించే విధానంలో అంబేద్కర్‌ వంటి పెద్దలు సూచించిన ఆదేశిక సూత్రాలను ఉల్లంఘిస్తున్నాయి. అనేక చట్టాలను కాంగ్రెస్‌ కూడా కేంద్రీకృతం చేసింది. కేంద్రంలో ఎవరున్నా తమ అధికారాలను కిందికి బదిలీ చేయాల్సిందిపోయి అధికారాలను కేంద్రీకృతం చేశారు. రాష్ర్టాల హక్కులను హరించారు. ఇప్పుడు అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు నరేంద్రమోదీ.. ఏకంగా మొత్తం కేంద్రీకృతం చేస్తున్నరు. చెప్పడం ఒకటి.. చేసేది మరొకటి. ఈ చట్టం వస్తే.. హైదరాబాద్‌లో ఉండే లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ పోతుంది. అన్ని రాష్ర్టాల్లోనూ ఇదే జరుగుతుంది. అన్నీ ఢిల్లీకి పోతాయి. రేపు కరెంట్‌ సమస్య ఏర్పడితే ఇక్కడ మాట్లాడే విద్యుత్‌ మంత్రి, ముఖ్యమంత్రి ఢిల్లీకి పోవాలె.. అడుక్కోవాలె.. గడ్డాలు పట్టుకోవాల్సిన పరిస్థితి. కాంగ్రెస్‌, బీజేపీ ఏ ఒక్క రోజు కూడా దేశం మొత్తానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోలేదు. అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నరు.

ప్రజల అధికారం ఇక ప్రైవేటుకే

ఈ చట్టం అమల్లోకి వస్తే అనేక ప్రమాదాలు ఉన్నయి. ఇప్పుడు మనం నియంత్రణ చేస్తున్నం. పరిశ్రమలకు ఒక లిమిట్‌లో కరెంటు ఇస్తున్నం. ఈ చట్టం వస్తే మొత్తం మారిపోతది. మరి అట్లాంటప్పుడు మన డిస్కంలు, ట్రాన్స్‌కో, జెన్‌కో ఎక్కడికి పోవాలె? అందులో పనిచేసే 50వేల మంది ఉద్యోగులు ఎక్కడికి పోవాలె? ఈ సంస్థలు మొత్తం మునిగిపోతే ఎట్ల? ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌ పోయింది. ఎల్‌ఐసీకి కూడా దెబ్బపెట్టిన్రు. విమానాలు, రైళ్లు అన్నీ వరుసపట్టి పోతున్నయి. అంతా గోవింద మంగళం అయితది. పబ్లిక్‌రంగ సంస్థలు ఉండవు. వీళ్లు ఉండనీయరు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ కంపెనీలు ఉన్నయి. వాళ్లు సరఫరా చేసి బిల్లులు తీసుకుంటున్నరు. దానికి ప్రైవేటు కంపెనీలను సప్లయిస్‌కు పిలుస్తరట. వాడు ఎక్కడినుంచైనా కరెంటు కొనుక్కోవచ్చు, ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఇప్పుడున్న మన డిస్ట్రిబ్యూటరీ కంపెనీలు, దాంట్లో ఉన్న ఉద్యోగులు ఎక్కడికి పోవాలె? ప్రజల చేతుల్లో ఉన్న అధికారాన్ని తీసుకుపోయి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే బిల్లు ఇది.

అన్న వస్ర్తానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టుంది

ఒక దగ్గర లాభం వస్తది, ఒక దగ్గర నష్టం వస్తది. ఆ నష్టాన్ని లాభంతో సరిచేసుకొని, ప్రజలకు కొంత చౌకగా విద్యుత్తు ఇస్తున్నం. ఇది క్రాస్‌ సబ్సిడైజేషన్‌. దానికి మంగళం పడుతది. అసలు క్రాస్‌ సబ్సిడీ కాదు.. డిస్కంలే ఉంటయా? మునుగుతయా? తెల్వదు. జెన్‌కో, ట్రాన్స్‌కో ఉంటదా? మునుగుతదా? అదో పెద్ద ప్రశ్న. ఈఆర్సీ ఏర్పాటు అధికారం ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది. రేపు కేంద్రం తీసుకుంటుంది. నియంత్రణ (లోడ్‌ రిలీఫ్‌) ఇప్పుడు మన చేతుల్లో ఉంటే ఈ చట్టంతో ఢిల్లీకి పోతది. అన్న వస్ర్తానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్లుంది ఈ బిల్లు పరిస్థితి. ఏదైనా బిల్లు వస్తే రాష్ర్టాలకు అధికారం ఇంకింత పెరగాలి, ప్రజలకు ఇంకింత లాభం జరగాలి కానీ.. అవేవీ లేవు.

జల విద్యుత్‌ను లెక్కలోకే తీసుకోరట!

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

September 16, 2020