నలుపు.. గెలుపు!

Namaste Telangana Hyderabad|July 10, 2020

నలుపు.. గెలుపు!
నలుపు..అన్ని రంగుల్లాంటిదే. నల్లవాళ్లు..అందర్లాంటి మనుషులే! తెలుపు ఎక్కువ కాదు. నలుపు తక్కువా కాదు. ఏ రంగు హంగు ఆ రంగుదే! మల్లెపూవుతో నల్లకలువకు పోటీపెడతారా? ఓ వర్ణాంధత్వ సమాజమా..ఇట్స్‌ అన్‌"ఫెయిర్‌'! ఈ వివక్ష అనాగరికం! మీ కొలమానాల్ని తగులబెట్టండి!.. సౌందర్యాన్ని నలుపు-తెలుపు ఆధారంగా విభజించే ధోరణిని తీవ్రంగా నిరసిస్తూ, తీక్షణంగా నినదిస్తూ.. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో పెద్ద ఉద్యమమే మొదలైంది. ఆ దెబ్బకు కొన్ని ఉత్పత్తుల పేరు మారింది, కొన్ని వాణిజ్య ప్రకటనల తీరు మారింది. అయినా, మారాల్సింది చాలానే ఉందంటున్నారు ఓ ఇంటర్వ్యూలో... అంజలీ పాటిల్‌ (నటి), మిథూసేన్‌ (చిత్రకారిణి), సృష్టి జూపూడి (బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి).

ప్రతి రంగూ అమూల్యమైందే!

  • మిథూసేన్‌ చిత్రకారిణి

అప్పటికి నేను చిన్నదాన్ని.

చెల్లి నా కంటే ఇంకా చిన్నది. దసరా నవరాత్రులకు మా అమ్మ నాకూ చెల్లికీ ఒకేరంగు దుస్తులు కుట్టించింది. ఆ పింక్‌కలర్‌ ఫ్రాక్‌లో మేం ఇద్దరం అమ్మవారి మండపం దగ్గరికి వెళ్లాం. ‘ఎంత ముద్దొస్తున్నావో! నా దిష్టే తగిలేట్టు ఉంది! చిదిమి దీపం పెట్టుకోవచ్చు’ అంటూ అందరూ చెల్లినే పొగిడేస్తున్నారు. నన్ను ఎవరూ పట్టించుకోలేదు. మొహమాటానికి అయినా నా డ్రెస్సు బాగుందని అనలేదు. ఒకరిద్దరైతే ‘నీ రంగుకు పింక్‌ అస్సలు సూట్‌ కాదు’ అని మొహం మీదే చెప్పేశారు. చెల్లె తెల్లగా ఉంటుంది. నేనేమో నలుపు! అప్పటి నుంచీ చాలాకాలం పింక్‌ డ్రెస్‌ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. బొమ్మలు గీస్తున్నప్పుడు కూడా పింక్‌ అస్సలు వాడేదాన్ని కాదు. ఆ రంగు అంటే.. భయం, కోపం, వ్యతిరేకత.

ఆ నెగెటివ్‌ భావాల మధ్యే పెరిగాను. శాంతినికేతన్‌ విశ్వభారతి యూనివర్సిటీలో చదువు నా జీవితంలో ఓ గొప్ప మలుపు. ఫైన్‌ఆర్ట్స్‌ విద్యార్థిగా క్యాంపస్‌లో అడుగుపెట్టాను. నేను ఆడగలను. పాడగలను. దీంతో, ర్యాగింగ్‌లో నన్ను ఇబ్బందిపెట్టడానికి సీనియర్స్‌కు ఏ సాకూ దొరకలేదు. ఆ సమయంలోనే, నేను క్యాంటీన్‌కు వెళ్తుంటే ఓ అమ్మాయి చేయి పట్టుకుని ఆపింది.తన పేరు నటాషా అని చెప్పింది.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 10, 2020