అటూ ఇటూ తిరుగుతూ ఆగం కావొద్దు

Namaste Telangana Hyderabad|July 10, 2020

అటూ ఇటూ తిరుగుతూ ఆగం కావొద్దు
కరోనా అనగానే కంగారు పుడుతుంది.. ఆ కంగారులో దవాఖాన గుర్తుకొస్తుంది. సర్కారు దవాఖానకు వెళ్తే బాగా చూసుకుంటారో, లేదో అన్న అనుమానం..
  • కరోనా రోగులకు కావాల్సినన్ని బెడ్లు

  • ప్రభుత్వ దవాఖానల్లో పూర్తిస్థాయి చికిత్స

  • ప్రైవేటుకు దీటుగా వైద్యసేవలు, సౌకర్యాలు

  • ఎక్కడైనా అవే మందులు, అదే చికిత్స

  • అనేక మంది ఆరోగ్యంగా బయటపడ్డారు

  • 92% సర్కారు దవాఖానల్లో ఖాళీగా ఉన్న బెడ్లు

  • 104 కొవిడ్‌ వివరాలకు డయల్‌ చేయండి

డబ్బు పోయినా ఫరవాలేదు, ప్రాణాలు కాపాడుకుందాం.. అని కొందరు ప్రైవేటు దవాఖానలకు వెళ్తున్నారు. కానీ, అక్కడ పట్టించుకోక అటు తిరిగి, ఇటు తిరిగి చివరికి సర్కారు దవాఖానలే దిక్కని వస్తున్నారు. ఈలోగా రోగం ఎక్కువై ప్రాణాలు కోల్పోతున్నారు. వద్దు.. ఆగమాగం కావొద్దు. సర్కారు దవాఖానల్లో కావాల్సినన్ని బెడ్లు ఉన్నాయి. దేవుళ్లలాంటి వైద్యులున్నారు. అమ్మలా చూసుకొనే నర్సులున్నారు. పైసా ఖర్చు లేకుండా ప్రాణాన్ని కాపాడే వసతులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వమూ మనకు అండగా ఉన్నది. రోగం ఎక్కువుంటేనే దవాఖానకు వెళ్లాల్సిన అవసరం ఉంది. వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉంటే ఇంట్లోనే జాగ్రత్తలు పాటిస్తూ మన ప్రాణాలను కాపాడుకోవచ్చు.

దగ్గితే దడ.. తుమ్మితే భయం.. జ్వరం వస్తే జంకు.. కరోనా వైరస్‌ సోకిందేమోనన్న అనుమానం. ఆ వెంటనే గుండెల్లో దడ. శరీరమంతా వణుకు. పైసలు పోతేపోనీ జల్ది దవాఖానలో చేరుదామని ప్రైవేటు దవాఖానకు పరుగు పెడుతున్నారా? అటు ఇటు తిరుగుతూ జేబులు గుల్ల చేసుకుంటున్నారా? పరేషాన్‌ అయ్యి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఆగం కాకండి. అండగా నిలిచేందుకు సర్కారు ఉన్నది. అక్కున చేర్చుకునేందుకు ప్రభుత్వ దవాఖానలున్నాయి.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ సిటీ బ్యూరో : వైరస్‌ సోకిందన్న అనుమానం ఉన్నా, లక్షణాలు బయటపడినా తగు జాగ్రత్తలతో మనల్ని మనం కాపాడుకోవచ్చు. వాస్తవానికి వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత లక్షణాలు బయటపడ్డానికి ఐదు రోజుల నుంచి 14 రోజుల సమయం పడుతున్నది. వైరస్‌ సోకిన వారిలో కొందరిలో లక్షణాలు కనిపించడం లేదు. మరికొందరిలో స్వల్ప లక్షణాలు బయటపడుతున్నాయి. కేవలం 5 శాతం మందిలో తీవ్ర లక్షణాలుంటున్నాయి. అయితే, చాలామంది ప్రైవేటు దవాఖానల చుట్టూ తిరిగి, వాళ్లు చేర్చుకోకపోతే ప్రభుత్వ దవాఖానలకు వస్తున్నారు. ఈ క్రమంలో విలువైన సమయాన్ని వృథా చేసుకుంటూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. వైరస్‌ పరీక్షల నుంచి చికిత్స వరకు అవగాహన లేకపోవడం వల్ల శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారు. అందుకే ప్రతి ఒక్కరు వైరస్‌ లక్షణాలు, ప్రభుత్వం అందిస్తున్న చికిత్స, అత్యవసర పరిస్థితుల్లో చేయాల్సిన పనుల గురించి కచ్చితంగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి గురించి శాస్త్రీయమైన అవగాహన పెంచుకోవాలని, తద్వారా వైరస్‌పై పైచేయి సాధించవచ్చని చెప్తున్నారు.

లక్షణాలున్నా కరోనా సోకినట్టు కాదు..

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 10, 2020