పరుగులిడి గోదారి.. పండుగే రాగా!

Namaste Telangana Hyderabad|May 29, 2020

పరుగులిడి గోదారి.. పండుగే రాగా!
కొండపోచమ్మ ఒడిలోకి నేడు కాళేశ్వర జలాలు

కొండమీద గోదారి పండుగొచ్చింది. జాలుగా పారేటి గంగమ్మ.. జలజలా పొంగెత్తి.. ఉప్పొంగి కదులుతూ..నడుస్తూ.. ఎగుస్తూ.. పరుగుపరుగున పైపైకి సాగింది. మేడిగడ్డ నుంచి ప్రారంభమైన గోదావరి ఊర్థ్వముఖ ప్రస్థానం.. తెలంగాణలోనే ఎత్తయిన కొండపైకి చేరి ఆనందతాండవం చేయనున్న అపూర్వక్షణమిది. సృష్టికి ప్రతి సృష్టి ఈ జలవృష్టి. ఈ నీరు మన నేలతల్లి దప్పిక తీర్చగల జీవనాళిక. కొండపోచమ్మ తల్లికి నేటి కాళేశ్వర జలాభిషేకంతో తెలంగాణ దశాబ్దాల దప్పిక తీరబోతున్నది. మూడేండ్ల క్రితం ప్రారంభమైన కాళేశ్వర గంగ ప్రస్థానంలో సుందర దృశ్యం ఆవిష్కారమవుతున్నది.

11.30 గంటలకు మర్కూక్ నుంచి నీటి విడుదల

• రెండు మోటర్లను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

• ప్రారంభోత్సవానికి చినజీయర్ స్వామి హాజరు

• కొండపోచమ్మ ఆలయం వద్ద చండీ యాగం

• మర్కూక్ పంపుహౌజ్ వద్ద సుదర్శన యాగం

• ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్, కలెక్టర్

సిద్దిపేట/గజ్వేల్, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగం గా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన కొండ పోచమ్మ రిర్వాయర్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రారంభించ నున్నారు. ఈ కార్యక్రమానికి త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి హాజరవుతున్నారు. ఉదయం 11.30 గంటలకు మర్కూక్ పంప్ హౌజ్ దగ్గర రెండు మోటర్లను ప్రారంభించి కాళేశ్వర జలాలను కొండ పోచమ్మ రిజర్వాయర్ లోకి పంపిస్తారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కరోనా నేపథ్యంలో అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకొన్నారు.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 29, 2020