స్మార్ట్ ఫోన్లా.. మజాకా!

Namaste Telangana Hyderabad|December 31, 2019

స్మార్ట్ ఫోన్లా.. మజాకా!
న్యూఢిల్లీ, డిసెంబర్ 30:

ఆర్థిక మందగమనంలోనూ స్మార్ట్ ఫోన్ అమ్మకాలుఅదిరిపోయాయి. కార్లు, బైకుల దగ్గర్నుంచి బిస్కట్లవరకు ఈ ఏడాది కొనుగోళ్లు పడిపోయినా.. స్మార్ట్ ఫోన్ విక్రయాలు మాత్రం ఆగలేదు. 2019లోభారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ 9 శాతం పెరిగినట్లు తేలింది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ వ్యవధిలో దేశంలోకి 115 మిలియన్లకుపైగా స్మార్ట్ ఫోన్లు దిగుమతి అయ్యాయి. షియామీ, సామ్ సంగ్, వివో,ఒప్పో, రియల్‌ ్స సంస్థలు టాప్-5లో నిలిచాయి.నిజానికి ఈ ఏడాది స్మార్ట్ ఫోన్ల సగటు ధరలు పెరిగాయి. నిరుడు రూ.5 వేల నుంచి 10 వేలు పలికిన స్మార్ట్ఫోన్లు.. ఈ ఏడాది రూ.10 వేల నుంచి15 వేలకు చేరాయి. అయినప్పటికీ అమ్మకాలుఆగలేదు. చాలా మంది ఖరీదైన మొబైల్ కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఈ క్రమంలోనే ప్రీమియంశ్రేణి మొబైల్ ఫోన్లకు ఆదరణ పెరిగింది.రూ.14,000 నుంచి రూ.21,000-35,000స్థాయి వరకు ధరలున్న స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లుఊపందుకున్నాయని, ప్రధానంగా షియామీ, ఒప్పో, వ ప్లస్ మోడళ్లకు డిమాండ్ కనిపించిందని అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) గణాంకాలు చెబుతున్నాయి. మార్కెట్లో 80 శాతానికి వీటి వాటా చేరిందని ఐడీసీ ఈ సందర్భంగా పేర్కొన్నది. స్మార్ట్ ఫోన్ వినియోగంలో అప్ గ్రేడ్ అవుదామనుకునే వారి సంఖ్య క్రమేణా పెరుగుతున్నదని, డిజైన్, ఇతరత్రా సదుపాయాలను చూస్తున్నారని ఐడీసీ ఇండియా అసోసియేట్ రిసెర్చ్ మేనేజర్ (క్లయింట్ డివైజెస్) ఉపాసన జోషి అన్నారు.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

December 31, 2019