పేదల పక్షాన ప్రశ్నించే గొంతుకై.. అవిశ్రాంత పోరాటయోధుడై..
AADAB HYDERABAD|24-09-2020
పేదల పక్షాన ప్రశ్నించే గొంతుకై.. అవిశ్రాంత పోరాటయోధుడై..
ఎమ్మెల్సీ బరిలోకి దిగుతూ.. ప్రత్యర్థుల్లో అలజడి రేపుతున్న స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న..

అతని గళం లో పేదల కష్టాలు పలుకుతాయి. అతని విమర్శలకు అవినీతి ప్రభుత్వాలు సిగ్గుతో తలదించుకుంటాయి. ఆధారాలు లేకుండా విషయాన్ని వెలుగులోకి తేవడం అతని నైజం కాదు. పేదల పక్షపాత ప్రభుత్వం ఏర్పడాలన్నదే ఆయన ధ్యేయం. తనమీద అక్రమ కేసులు నమోదు అవుతున్నా ఆయన గుండె ధైర్యం సడలలేదు. పడి లేచే కెరటమై అక్రమాలపై, అన్యాయాలపై ధ్వజమెత్తుతూనే వున్నాడు. పేద వర్గాలకు పెన్నిధిలా, ఆశాజ్యోతిగా మారారు. ఆయనే అభిమానులకు 'తీన్మార్ మల్లన్న' గా సుపరిచితుడైన నవీన్ కుమార్. షోషల్ మీడియా వేదికగా పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్న ఈ సారి ఎమ్మెల్సీ బరిలోకి పేదల పక్షాన నిలబడుతున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజక వర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. లక్షలాది అభిమానుల్ని సంపాదించుకున్న 'తీన్మార్ మల్లన్న' పేదల పక్షాన గొంతుకై వెలుగెత్తడానికి సిద్ధం అవుతున్నారు. ఆయన గెలుపు తప్పదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. పేదల పక్షపాతి అయిన 'తీన్మార్ మల్లన్న' కు అభినందనలు తెలుపుతోంది 'ఆదాబ్ హైదరాబాద్'. ఈ సందర్భంగా 'తీన్మార్ మల్లన్న' ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ సారాంశం మీముందుకు..

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

24-09-2020