పూర్తి స్థాయి సడలింపులు

AADAB HYDERABAD|28-05-2020

పూర్తి స్థాయి సడలింపులు
• సిటీ సర్వీసులకు అనుమతి నిరాకరణ• రూ.1500 నగదు కార్యక్రమం నిలిపివేత• ఆ పంటలే వేయాలి.. అన్ని గ్రామాలకు విత్తనాలు• సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్

“తెలంగాణకు నెల నెలా రూ.12 వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ వల్ల మొత్తం పోయింది. మే నెలలో కేంద్రానికి వెళ్లే పన్నుల్లో రాష్ట్ర వాటాగా రావాల్సిన రూ.982 కోట్లతో కలిపి కేవలం రూ.3,100 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇటీవల ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనల సడలింపులు ఇచ్చినా ఆదాయం పెద్దగా ఏం పెరగలేదు. ఈ డబ్బులతోనే అన్ని అవసరాలు తీరాలి. రాష్ట్రం ఏడాదికి రూ.37,400 కోట్లను అప్పులకు నెలనెలా కిస్తీల రూపంలో చెల్లించాల్సి ఉంది. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని మే నెలలో కూడా కొనసాగించాలి. లాక్ డౌన్ సడలింపుల కారణంగా కార్మికులు, కూలీలకు పని దొరుకుతోంది. కాబట్టి ప్రతీ కుటుంబానికి నెలకు రూ.1,500 నగదు కార్యక్రమం మే నెల నుంచి ఆపేయాలి. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, అఖిల భారత సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా యథాతథంగా కొనసాగించాలి." - సీఎం కేసీఆర్

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

28-05-2020