2020 ఎలా ఉంటుంది?
Andhra Bhoomi Weekly|February 27, 2020
2020 ఎలా ఉంటుంది?
2020 కొత్త సంవత్సరం అడుగుపెట్టే సందర్భంలో జార్ఖండ్ రాష్ట్రఎన్నికల ఫలితాల దృష్ట్యా పరిశీలిస్తే, భారత రాజకీయ ముఖచిత్రం కొత్తమలుపు తిరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. భారత ప్రజాస్వామ్యం 70 ఏళ్లుపై బడిన ప్రస్థానంలో రాష్ట్రాలలోను, కేంద్రంలోను అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీల తీరుతెన్నులు కేంద్రాధికారంపై ఆధారపడే విధంగా వుండకతప్పటం లేదు.కానీ ప్రస్తుత ఎన్డీఏ, యుపిఏ కూటమిలలోని చిన్నా, పెద్దప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలలో ప్రాబల్యం పెంచుకొని, బడా జాతీయ పార్టీలకు ఊపిరి సలపనివ్వటం లేదు.

జాతీయ పార్టీల దూకుడు ఆధిపత్య వైఖరిని ఎదుర్కోవటంలో ప్రాంతీయ పార్టీలు విజయవంతమవుతున్నాయి. 'కాంగ్రెస్ ముక్త భారత్' అంటూ ఎలుగెత్తి చాటి పార్లమెంటులో తిరుగులేని ఆధిక్యత సాధించిన భారతీయ జనతాపార్టీ సారధ్యం ఏడాదిలోనే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీ గడ్, మహా రాష్ట్ర తాజాగా జార్ఖండ్ రాష్ట్రాలలో అధికారం కైవశం చేసుకోలేకపోవటం బిజెపి నేతలకు మింగుపడని అంశం అయింది.

కర్ణాటక రాష్ట్రంలో ఒంటిచేత్తో ఉట్టికొట్టే సత్తువ లోపించటంతో, ఎలాగైనా పగ్గాలు చేపట్టడానికి, కమలనాథులు ప్రదర్శించిన రాజనీతి, అదేవిధంగా హరియానాలో అవకాశవాద చెలిమి, గద్దె అధిష్ఠించడానికి ఏ అడ్డదారైనా తొక్కగలమనే ఆదర్శం వ్యక్తమవుతోంది. హరియానాలో బిజెపి ప్రయోగించిన పాచిక, మహారాష్ట్రలో కాంగ్రెస్-శివసేనల పొత్తు, దేశ రాజకీయాల స్థితిగతులకు అద్దంపట్తోంది.

భారత ప్రజాస్వామ్యంలో పార్టీ ఫిరాయింపులు, ఒక పార్టీ టిక్కెట్ పైగెలిచి అధికార పార్టీలోకి కుప్పిగంతులు మనకి కొత్త కాదు. ఏరు దాటాక తెప్ప తగలేసే రాజకీయం, విశ్వసించి ఓట్లు వేసి గెలిపించిన ఓటర్లు ఆమో దించవలసినదే. సిద్ధాంతాలకు ఏనాడో రాజకీయ పార్టీలు తిలోదకాలు ఇచ్చివేసాయి. పైగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయటానికి మూకు మ్మడిగా, అధికారపార్టీలో శాసనసభ్యులందరూ చేరటం అనే దుర్నీతి రాజ కీయంలో చోటుచేసుకుంది. అందరికీ అధికారమే నేడు పరమావధిగా, ప్రతిపక్ష ప్రాధాన్యత నిర్వీర్యమవుతోంది.

మారుతున్న భారతీయ ముఖచిత్రం

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

February 27, 2020