అన్నదాతలు ఎక్కడ నష్ట పోకూడదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్
అన్నదాతలు ఎక్కడ నష్ట పోకూడదు  ముఖ్యమంత్రి వైఎస్ జగన్
అన్నదాతలు ఎక్కడ నష్ట పోకూడదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్

ప్రభుత్వం ప్రకటించిన ధరల కన్నా రైతులు తక్కువకు అమ్ము కోవాల్సిన పరిస్థితి వస్తే వెంటనే జోక్యం చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. పంట కొనుగోలు చేసిన వారంలోగా రైతులకు డబ్బులు అందాలని, నెల రోజుల్లో పరిస్థితి మారకపోతే సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తానని హెచ్చరించారు. అగ్రి వ్యవ సాయ మిషన్ సమీక్షలో భాగంగా ఆయన పంటల కొనుగోలు కేంద్రాల తీరు,రైతులకు లభిస్తున్న ధరలపై ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాలు మరింత సమర్ధవంతంగా నడపటానికి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన ధరల పట్టిక ఉంచాలని స్పష్టం చేశారు. ప్రకటించిన ధరల కన్నా తక్కువకు కొనుగోలు చేస్తే వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగి కొనుగోళ్ళు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం సరైన మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం శనగలు, కందులు మార్కెట్లోకి వస్తున్నాయని, కొనుగోళ్ళలో రైతులు నష్టపోకుండా చూడాలని ఆదేశించారు.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

February 2020