![భగవద్గీత సారాంశంలో ఏముందంటే..?](https://cdn.magzter.com/1426332426/1704942585/articles/5FWI4JnK61706636073526/1706636586683.jpg)
ప్రపంచంలో ఏ మత గ్రంథాలకు లేని విశిష్టత ఒక్క 'భగవద్గీత' కు మాత్రమే ఉంది.. అది ఏమిటంటే లోకా సమస్తా సుఖినోభవంతు అంటూ.. లోకానికి మంచి చేయడం కోసం జన్మించిన అవతారపురుషులను, మహర్షులను, మహానుభావులను తలచుకుంటూ.. వారి చేసిన మహోపకారానికి కృతజ్ఞత తెలుపుతూ..వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ జయంతిని జరుపుకుంటాం..అయితే ఒక పుస్తకానికి కూడా జయంతి వేడుకలను నిర్వహిస్తాం.. ఇలా ప్రపంచంలో ఏ ఇతర మతగ్రంథాలకు కూడా లేదు.. ఆ పుస్తకమే భగవద్గీత. లోకానికి గీత వలన జరిగిన మహోపకారానికి గుర్తుగా గీతాజయంతి ని జరుపుకుంటాం. అయితే ఈ రోజు భగద్గీత వలన లోకానికి కలిగిన ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..
సుమారు 5200 సంవత్సరాల క్రితం సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా బోధింపబడినవి. గాఢాంధకారాన్ని యోగములు చీల్చుకుంటూ..మానవజాతి పై వెలుగులు విరజిమ్ముతూ భగవద్గీత ఉ దయించింది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని “నా కర్తవ్యమేమి?” అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథ సారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.
భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆర్యోక్తి. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః పార్థో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ భగవద్గీత నుండి మార్గదర్శకత్వము పొందినవరిలో ఎందరో యోగులు, తాత్త్వికులు ఉన్నారు. ఇస్కాన్ వారు భగవద్గీత ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే కొన్ని కోట్ల మంది కృష్ణ భక్తులుగా మారారు.
భగవద్గీత విశ్లేషణ
هذه القصة مأخوذة من طبعة Telugu muthyalasaralu من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Telugu muthyalasaralu من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
![గుడిపాల మండలంలో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మరియు ఆర్ ఓ.పి.శ్రీనివాసులు](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/l7_aPFUtx1716994904550/1716998899732.jpg)
గుడిపాల మండలంలో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మరియు ఆర్ ఓ.పి.శ్రీనివాసులు
గుడిపాల మండల పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో అన్ని రకాల మౌళి సదు పాయాలు కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు 172 చిత్తూరు నియోజకవర్గం రిటన్నింగ్ అధికారి పి.శ్రీనివాసులు పేర్కొన్నారు.
![వాలంటీర్లకు ఈసీ షాక్...వైసీపీ కి కొత్త అస్త్రమా...!?](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/KpeDtY5TM1716994638064/1716994898220.jpg)
వాలంటీర్లకు ఈసీ షాక్...వైసీపీ కి కొత్త అస్త్రమా...!?
వాలంటీర్లకు ఈసీ షాక్ ఇచ్చింది. వారిని ఎన్నికలు ముగిసేంత వరకూ దూరం పెట్టాలని ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
![భావ ప్రకటనా స్వేచ్ఛకు పరిమితి లేదా!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/dauIWawdQ1716994545574/1716994636640.jpg)
భావ ప్రకటనా స్వేచ్ఛకు పరిమితి లేదా!
చెప్పేది మంచి అయినప్పుడు 'వినదగునెవ్వరు చెప్పిన' అన్నది కరెక్టే. ద్వేషభావం, కోపం, బాధ కలిగించనివి, అసత్యాలు కానివి చెప్పడమైనా, వినడమైనా మంచిదే. కానీ నేడు ఆ సంస్కృతి కనపడడం లేదు.
![ఆఫీసుకు రాకుంటే ప్రమోషన్ కట్.. ప్రముఖ కంపెనీ షాకింగ్ నిర్ణయం](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/tUjvzBuul1716994367430/1716994464210.jpg)
ఆఫీసుకు రాకుంటే ప్రమోషన్ కట్.. ప్రముఖ కంపెనీ షాకింగ్ నిర్ణయం
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి వేళ అన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులందరికి వర్కు ఫ్రం హెూం వసతిని కలిగించ టమే కాదు కరోనా తగ్గిన తర్వాత కూడా అదే తీరును కొనసాగించింది.
![ప్రపంచంలోనే సంతోషకర దేశం ఫిన్ ల్యాండ్.. భారత్ స్థానం ఏంటో తెలుసా?](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/bHYgUsvpF1716994297181/1716994364957.jpg)
ప్రపంచంలోనే సంతోషకర దేశం ఫిన్ ల్యాండ్.. భారత్ స్థానం ఏంటో తెలుసా?
మనిషి సంతోషంగా జీవించాలని అనుకుంటాడు. అందుకను గుణంగా తన జీవన విధానం ఏర్పాటు చేసుకుంటాడు.
![షర్మిల.. కడప గడపలో ఏం జరగబోతోంది?](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/dkZoEtiqA1716994158343/1716994294596.jpg)
షర్మిల.. కడప గడపలో ఏం జరగబోతోంది?
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి.
![చేతులు సరిగా శుభ్రం చేసుకోకపోతే ఆ వ్యాధి వస్తుంది తెలుసా?](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/eF0MfMpMX1716993966494/1716994150381.jpg)
చేతులు సరిగా శుభ్రం చేసుకోకపోతే ఆ వ్యాధి వస్తుంది తెలుసా?
భోజనం చేసే సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కుంటేనే మనకు నష్టాలు ఉండవు.
![సిద్ధం వర్సెస్ ప్రజాగళం.! ఏపీలో రగులుతున్న రాజకీయ రగడ.!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/P3jOp-WLw1716968440579/1716993967156.jpg)
సిద్ధం వర్సెస్ ప్రజాగళం.! ఏపీలో రగులుతున్న రాజకీయ రగడ.!
సిద్ధం పేరుతోనే ఈసారి ఎన్నికలు చుట్టేయాలని జగన్ భావిస్తున్నారు ఏపీలో అధి కార వైసీపీ సిద్ధం అంటోంది. ఆ పేరు పెట్టుకునే ఎన్నికల సభలను చేస్తోంది.
![స్త్రీలు పురుషుల నుంచి కోరుకునే 7 డిమాండ్లు.! ఏంటో చూడండి..!](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/AJWVt02K31716968128170/1716968321028.jpg)
స్త్రీలు పురుషుల నుంచి కోరుకునే 7 డిమాండ్లు.! ఏంటో చూడండి..!
స్త్రీలు పురుషులకు ఎప్పుడూ రహస్యంగానే కనిపిస్తారు. వాటిని అర్థం చేసుకోలేరన్నది ప్రతి మనిషి వాదన.
![కూటమి ఫస్ట్ మీటింగ్... హిట్టేనా...!?](https://reseuro.magzter.com/100x125/articles/9310/1697808/cistOvRkP1716967416522/1716968125974.jpg)
కూటమి ఫస్ట్ మీటింగ్... హిట్టేనా...!?
టీడీపీ జనసేన బీజేపీ జట్టు కట్టిన తరువాత పెట్టిన ఫస్ట్ మీటింగ్ చిలకలూరిపేట బొప్పూడి వద్ద జరిగింది.